గులాం అలీ..గజల్ గురించి, హిందుస్తానీ సంగీతం గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు.
ఢిల్లీ: గులాం అలీ..గజల్ గురించి, హిందుస్తానీ సంగీతం గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గజల్స్ వినేందుకు ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే సోమవారం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరగాల్సిన ఆయన కార్యక్రమం రద్దయింది. హిందూ సేన నుంచి కార్యక్రమాన్ని నిర్వహించకూడదని హెచ్చరికలు రావడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
ఢిల్లీలోని రాయల్ ప్లాజా హోటల్లో సోమవారం సాయంత్రం 'గర్ వాపసీ' చిత్ర సంగీతాన్ని విడుదల చేసి అనంతరం కచేరి నిర్వహించాల్సి ఉంది. ఆర్ఎస్ఎస్, భజ్రంగ్ దళ్, హిందూసేనలనుంచి బెదిరింపులు రావడంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా తనకు ఫోన్ చేసి బెదిరించారని గర్ వాపసీ చిత్ర నిర్మాత సుహైబ్ ఇల్యాసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.