రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెతో సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు.
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెతో సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. లలిత్ మోదీ వ్యవహారంలో వసుంధర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రాజెపై ఆరోపణలు వచ్చిన తర్వాత ఆమె బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నేతతో సమావేశం కావడం ఇదే తొలిసారి.
మోదీ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు వసుంధర ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో సమావేశం కావాలని ప్రయత్నించినా వీలు కాలేదు. కాగా మోదీ వ్యవహారంలో రాజెకు బీజేపీ అధినాయకత్వం బాసటగా నిలిచింది. రాజె కుమారుడు, ఎంపీ దుష్యంత్, మోదీల సంబంధాలు వ్యాపారపరమైనవని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.