షూటింగ్‌లకు త్వరలోనే అనుమతి

G Kishan Reddy Speaks About Movie Shooting - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సినిమా షూటింగ్‌లకు త్వరలోనే అనుమతి ఇవ్వనున్నామని, దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకేరోజు తెరుచుకునేలా చూస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు భరోసా ఇచ్చారు. శనివారం తెలు గు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. కరోనా వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న  సమస్యలపై సినీ రంగ ప్రముఖులతో ఈ సందర్భం గా చర్చించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు, డైరెక్టర్‌ తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, వివేక్‌ కూచిభొట్ల, అనిల్‌ శుక్ల, అభిషేక్‌ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సినిమా ప్రముఖులు మంత్రి దృ ష్టికి షూటింగులకు అనుమతి, థియేటర్ల ప్రారంభం, క్యాప్టివ్‌ పవర్, పైరసీ, ఓటీటీలో సినిమా రిలీజ్, రీజినల్‌ జీఎస్టీ, టీడీఎస్, సినిమా కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు తెచ్చారు. వీటిపై స్పందించిన మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ షూ టింగ్‌లకు త్వరలోనే అనుమతి లభిస్తుందని, దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంటామని, అలాగే  పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలి పారు. ప్రాంతీయ భాషా సినిమాలు పెరిగేలా రీజి నల్‌ జీఎస్టీ మీద కూడా ఆలోచన చేస్తామని, సిని మా పరిశ్రమ వరకు క్యాప్టివ్‌ పవర్‌ కోసం విద్యుత్తు శాఖ మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

సీఎంలతో మాట్లాడి సాయం చేస్తా..
జమ్మూ కశ్మీర్‌ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూ టింగ్‌లు, స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా సీఎంలతో మాట్లాడి సహాయం చేస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక సమావేశం పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని సూచించారు. ప్రజలంతా ఈ కష్టకాలంలో రాజకీ య, మత, ప్రాంత, భాషాభేదాలకు అతీతంగా ఉం డాలని సూచించారు. కరోనా నుంచి బయటపడితే దేశం మళ్లీ పురోగతి సాధిస్తుందన్నారు. వీడియో కా న్ఫరెన్స్‌లో పాల్గొన్న సినీ ప్రముఖులను పేరుపేరు నా మంత్రి యోగక్షేమాలు అడిగారు. సినిమా ప్ర ముఖులు కూడా కిషన్‌ రెడ్డిని అభినందిస్తూ, ప్రభుత్వం బాగా పని చేస్తోందంటూ కితాబు ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top