ఏపీ దిశ చట్టం దేశానికే ఆదర్శం

G Himavati Appreciates CM Jagan Over Disha Case - Sakshi

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్‌ పర్సన్‌ హైమావతి

సాక్షి, న్యూఢిల్లీ:  ఏపీ దిశ చట్టం ఆడపిల్లలు, మహిళల భద్రతకు ఆయుధంలా పనిచేస్తుందని.. వారందరి తరఫున సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్‌ పర్సన్‌ జి.హైమావతి పేర్కొన్నారు. ఆదివారం ఆమె న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. నేరం జరిగినప్పుడు వెంటనే తీర్పు వెలువడితేనే దోషులు తప్పించుకోవడం, పై కోర్టులను ఆశ్రయించడం జరగదని తెలిపారు. ఈ చట్టం ద్వారా 14 రోజుల్లో కేసు విచారణ, 21 రోజుల్లో తీర్పు వెలువడేలా చేయడం హర్షించదగ్గ విషయమని, నిందితులకు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా శిక్ష పడుతుందని తెలిపారు. సుప్రీం కోర్టు ద్వారా యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో బాలల న్యాయ చట్టంపై జాతీయ సదస్సు డిసెంబర్‌ 14న ఢిల్లీలో జరిగిందని, రాష్ట్రంలో చేపడుతున్న బాలల స్నేహపూర్వక విధానాలు నివేదించామని తెలిపారు.   కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ సింగ్, బాలల న్యాయ కమిటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ దీపక్‌ గుప్తా హాజరయ్యారన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top