Sakshi News home page

బెంజ్ నుంచి పోర్షే దాకా..!

Published Mon, Apr 14 2014 3:22 AM

బెంజ్ నుంచి పోర్షే దాకా..!

న్యూఢిల్లీ: కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు ఇప్పుడు రాజకీయ దర్పానికి చిహ్నం గా మారిపోయూరుు. సంపద సమృద్ధిగా ఉన్న రాజకీయ నాయకులు మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ లేదా లీటర్ల కొద్దీ పెట్రోలు తాగే విలాసవంతమైన ఎస్వీయూలపైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు వారు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లను బట్టి స్పష్టమవుతోంది.
 
  ఇక స్కార్పియో, టాటా సఫారీ వంటి కార్లు సర్వసాధారణమై పోయూరుు. వృత్తిరీత్యా లాయర్, అమృత్‌సర్ బీజేపీ అభ్యర్థి అరుున అరుణ్ జైట్లీకి ఓ మెర్సిడెజ్, మరో బీఎండబ్ల్యూతో పాటు పోర్షే, హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్ ఉన్నారుు. ఇక భోజ్‌పురి నటుడు, ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి ఉన్న కార్ల శ్రేణిని చూసినా ఆశ్చర్యం వేస్తుంది. ఆడి క్యూ7, మెర్సిడిస్ బెంజ్, టయోటా ఫార్చ్యూనర్, హోండా సిటీ వాటిలో కొన్ని.
 
 మథుర బీజేపీ అభ్యర్థి నటి హేమామాలినికి మెర్సిడిస్ బెంజ్, టయోటా ఇన్నోవా కార్లుండగా, ఆమె భర్త, సినీ నటుడు ధర్మేంద్రకు రేంజ్ రోవర్ ఉంది. ఇక హర్యానా జనహిత్ కాంగ్రెస్ అధినేత కుల్దీప్ బిష్ణోయ్‌కు ఏకంగా ఐదు కార్లు (జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, ఆడి క్యూ7, రేంజ్ రోవర్ తదితరాలు), కాంగ్రెస్ అభ్యర్థి (టోంక్-సవారుు మాధోపూర్) అజారుద్దీన్‌కు రెండు కార్లు (బీఎండబ్ల్యూ 650ఐ, హోండా సీఆర్‌వీ) ఉన్నారుు.
 

Advertisement
Advertisement