విమానం టాయిలెట్‌లో మృతపిండం | Foetus found in plane's toilet | Sakshi
Sakshi News home page

విమానం టాయిలెట్‌లో మృతపిండం

Jul 26 2018 3:54 AM | Updated on Aug 28 2018 5:25 PM

Foetus found in plane's toilet - Sakshi

న్యూఢిల్లీ: గువాహటి నుంచి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఎయిర్‌ ఏసియా విమానం టాయిలెట్‌లో మృత పిండం కనిపించడం ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. పిండం వయసు దాదాపు ఆరు నెలలు ఉండొచ్చని సమాచారం. విమాన టాయిలెట్‌లో పేపర్లలో చుట్టి ఉన్న పిండాన్ని గమనించిన సిబ్బంది.. ఈ పని ఎవరు చేశారో చెప్పాలంటూ మహిళా ప్రయాణికులను ప్రశ్నిస్తుండగా తనకు గర్భస్రావం అయినట్లు 19 ఏళ్ల వయసున్న తైక్వాండో క్రీడాకారిణి వెల్లడించింది. ఆమె ఓ టోర్నమెంట్‌ కోసం గురువారం తన కోచ్‌తో కలసి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉంది. టాయిలెట్‌లో సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, పిండం కనిపించిందని ఎయిర్‌ ఏసియా అధికారులు తెలిపారు. పోలీసులు పిండాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, క్రీడాకారిణికి ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. అయితే ఆమె గర్భంతో ఉన్న విషయమే తనకు తెలియదనీ, విమానమెక్కే ముందు విమానయాన సంస్థకు సమర్పించిన వివరాల్లోనూ ఈ విషయం లేదని ఆమె కోచ్‌ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement