ఉగ్రదాడిలో పెరిగిన మృతుల సంఖ్య

Five Soldiers, Civilian Killed in Terror Attack on Jammu Army Base - Sakshi

ఆదివారం మరో ఇద్దరు జవాన్లు, పౌరుడు మృతి

కాల్పులను తిప్పికొడుతున్న భద్రతా బలగాలు

సాక్షి, సంజువాన్‌ : జమ్మూ కశ్మీర్‌లోని సంజువాన్‌లో భారత సైనికులకు,  జైషే మహమ్మద్‌ ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున నుంచి జరుగుతున్న ఈకాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ దాడుల్లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. మరో పదిహేను మందికి పైగా గాయపడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు గ్రనేడ్లు విసురుతూ, ఆర్మీ వసతి గృహ సముదాయంపై దాడికి యత్నించిన సంగతి తెలిసిందే.

అయితే ఉగ్రదాడులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. బలగాలు జరిపిన కాల్పులో శనివారం ముగ్గురు తీవ్రవాదులు హతమవ్వగా, ఆదివారం మరో ఉగ్రవాదిని కాల్చిచంపారు. అర్ధరాత్రి నుంచి ఆర్మీ క్యాంపులో చొరబడ్డ ఉగ్రవాదుల కోసం ప్రత్యేక ఆపరేషన్‌ కొనసాతోంది. ప్రస్తుతం సంజువాన్‌లో పరిస్థతి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డవారిలో హవిల్దార్‌ అబ్దుల్‌ హమీద్, లాన్స్‌ నాయక్‌ బహదూర్‌ సింగ్‌తో పాటు స్కూలు సెలవుల్లో తండ్రిని చూసేందుకు వచ్చిన సుబేదార్‌ మదన్‌లాల్‌ కుమార్తె కూడా ఉన్నారు. జమ్మూకు చెందిన ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ దాడి వివరాల్ని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top