ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది.
లంచ్ బాక్స్‌లో ఐదు కేజీల బాంబు
May 22 2017 6:04 PM | Updated on Oct 9 2018 2:53 PM
కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. మావోయిస్టులు అమర్చిన భారీ మందుపాతరను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. అమబేడ-ధనోరా గ్రామాల మధ్యనున్న రహదారిలోని వంతెన కింద లంచ్‌బాక్స్‌లో అమర్చిన బాంబును సోమవారం ఉదయం పోలీసులు, పారా మిలటరీ బలగాలు గుర్తించాయి. ఈ బాంబును బాంబ్ డిస్పోజల్ బృందాలు నిర్వీర్యం చేశాయి. అయిదు కిలోల బరువున్న ఈ బాంబు పేలితే భద్రతా దళాలకు భారీ నష్టం వాటిల్లి ఉండేదని కాంకేర్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement