ముంబై లగ్జరీ హోటల్‌లో అగ్నిప్రమాదం | Fire Breaks Out At South Mumbais Luxury Hotel Trident | Sakshi
Sakshi News home page

ముంబై హోటల్‌లో అగ్నిప్రమాదం

Dec 20 2018 8:45 AM | Updated on Dec 20 2018 8:46 AM

Fire Breaks Out At South Mumbais Luxury Hotel Trident - Sakshi

హోటల్‌ ట్రిడెంట్‌లో అగ్నిప్రమాదం

సాక్షి, ముంబై : దక్షిణ ముంబైలోని లగ్జరీ హోటల్‌ ట్రిడెంట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్‌లో మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక యం‍త్రాలతో మంటలను ఆర్పివేశారు. హోటల్‌ బేస్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరగ్గా సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 

ఈ ప్రమాదాన్ని లెవెల్‌ -2 ఫైర్‌గా గుర్తించినట్టు అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా సోమవారం అంధేరిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగడంతో తొమ్మిది మంది మరణించగా, 175 మంది గాయపడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement