మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అసభ్యకర ప్రసంగం చేశాడన్న ఆరోపణలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ...
న్యూఢిల్లీ: మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అసభ్యకర ప్రసంగం చేశాడన్న ఆరోపణలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతేడాది జూన్‌లో ఒవైసీ అసభ్యకర ప్రసంగం చేశాడని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సామాజిక కార్యకర్త అజయ్ గౌతమ్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన కోర్టు అసదుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిబ్రవరి 18న ఢిల్లీ పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.