‘నలందా’లో అన్ని దేశాల వారికీ అవకాశం: సుష్మ | External Affairs Minister Sushma Swaraj inaugurates Nalanda University | Sakshi
Sakshi News home page

‘నలందా’లో అన్ని దేశాల వారికీ అవకాశం: సుష్మ

Sep 20 2014 2:29 AM | Updated on Sep 2 2017 1:39 PM

‘నలందా’లో అన్ని దేశాల  వారికీ అవకాశం: సుష్మ

‘నలందా’లో అన్ని దేశాల వారికీ అవకాశం: సుష్మ

నలందా విశ్వవిద్యాలయానికి వస్తున్న అద్భుత స్పందన దృష్ట్యా దీనిని కేవలం తూర్పు ఆసియా దేశాల విద్యార్థులకే పరిమితం

రాజ్‌గిర్: నలందా విశ్వవిద్యాలయానికి వస్తున్న అద్భుత స్పందన దృష్ట్యా దీనిని కేవలం తూర్పు ఆసియా దేశాల విద్యార్థులకే పరిమితం చేయకుండా, ఇతర దేశాల వారికీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. బీహార్‌లో పునరుద్ధరించిన ఈ విశ్వవిద్యాలయాన్ని సుష్మాస్వరాజ్ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు మధ్య ఇది వారధి వంటిదన్నారు.

గతంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించి దేశాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసినట్లు చెప్పారు. నలంద విశ్వవిద్యాలయం మాత్రమే కాదని, అది సంస్కృతిలో భాగమని చెప్పారు. కేంద్రం ఇప్పటికే రూ.2,727 కోట్లు కేటాయించిందని, పదేళ్లలో ఉన్నతతరగతి క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం జితన్‌రామ్ మంజి, పలువురు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement