యాజమాన్యంపై ఉద్యోగుల యూనియన్‌ ఫైర్‌

EPF Employee In Maharashtra Dies Of Coronavirus - Sakshi

థానే పీఎఫ్‌ కార్యాలయంలో వైరస్‌ కలకలం

ముంబై : మహారాష్ట్రలోని థానే నగరంలో కోవిడ్‌-19 బారినపడిన ప్రావిడెంగ్‌ ఫండ్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి (31) మంగళవారం మరణించారని అధికారులు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంలో యాజమాన్యం విఫలమవడంతోనే ఈ విషాదం చోటుచేసుకుందని ఉద్యోగ సంఘం నేతలు ఆరోపించారు. హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ముందు జాగ్ర్తత్త చర్యలు చేపట్టాలని యాజమాన్యానికి తాము పలు లేఖలు రాసినా పట్టించుకోలేదని అదనపు కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌కు ఈపీఎఫ్‌ స్టాఫ్‌ యూనియన్‌ నేతలు సమర్పించిన మెమొరాండంలో పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న క్రమంలో తక్కువ సిబ్బందితో పనిచేయాలన్న కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌ ఆదేశాలను సైతం యాజమాన్యం విస్మరించిందని యూనియన్‌ ఆరోపించింది. థానే ఈపీఎఫ్‌ కార్యాలయంలో ఆరుగురు సిబ్బందికి కరోనా వైరస్‌ సోకిందని యూనియన్‌ నేతలు ఈ లేఖలో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top