ఎన్నికలు జరుగుతున్న రెండు రాష్ట్రాల్లోను ఇప్పటివరకు అందుతున్న ఆధిక్యాలు సుమారుగా ఎగ్జిట్ పోల్స్కు అనుకూలంగానే కనిపిస్తున్నాయి.
ఎన్నికలు జరుగుతున్న రెండు రాష్ట్రాల్లోను ఇప్పటివరకు అందుతున్న ఆధిక్యాలు సుమారుగా ఎగ్జిట్ పోల్స్కు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. జార్ఖండ్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మిగిలిన పార్టీలకు ఏమాత్రం అందుబాటులో లేకుండా దూసుకెళ్తోంది. అక్కడ మొత్తం 81 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 9 గంటల వరకు సుమారు 30 నియోజకవర్గాలకు సంబంధించిన ఆధిక్యాలు తెలుస్తున్నాయి. వాటిలో బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జేఎంఎం 5 స్థానాల్లోను, కాంగ్రెస్ 2 స్థానాల్లోను, జేవీఎం 2 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నాయి.
ఇక జమ్ము కశ్మీర్లో కూడా కొంతవరకు అనుకున్నట్లుగానే వస్తున్నా.. బీజేపీ మాత్రం అంచనాలను మించి కొంత ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికీ అక్కడ పీడీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 87 స్థానాలకు గాను 71 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు తెలుస్తున్నాయి. వాటిలో 28 చోట్ల పీడీపీ, 22 చోట్ల బీజేపీ ముందంజలో ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ 13, కాంగ్రెస్ 6, ఇతరులు 1 చోట ఆధిక్యంలో ఉన్నారు.