బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీ | ED questions Mithun Chakraborty | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీ

May 17 2015 3:28 PM | Updated on May 28 2019 10:05 AM

బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీ - Sakshi

బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీ

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల కోల్కతాలో బాలీవుడ్ హీరో, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తిని ప్రశ్నించారు.

కోల్కతా: కోట్లాది శారదా చిట్ఫండ్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల కోల్కతాలో బాలీవుడ్ హీరో, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తిని  ప్రశ్నించారు. ఆయన వాంగూల్మాన్ని నమోదు చేశారు.

శారదా గ్రూపునకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. వీటికి సంబంధించిన డీవీడీలు, సీడీలు, రికార్డులను ఈడీ అధికారులకు అందజేశారు. శారదా గ్రూపు నుంచి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానని మిథున్ చక్రవర్తి చెప్పారు. వృత్తిపరంగానే శారదా గ్రూపుతో పనిచేశానని, ఎవర్నీ మోసం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని మిథున్ చక్రవర్తి చెప్పారు. శారద స్కాంకు సంబంధించి తన పాత్ర లేదని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement