రాజా, కనిమొళిపై ఈడీ చార్జీషీట్ నమోదు! | ED files charge sheet against Raja, Kanimozhi in 2G scam | Sakshi
Sakshi News home page

రాజా, కనిమొళిపై ఈడీ చార్జీషీట్ నమోదు!

Apr 25 2014 5:02 PM | Updated on Sep 27 2018 5:03 PM

రాజా, కనిమొళిపై ఈడీ చార్జీషీట్ నమోదు! - Sakshi

రాజా, కనిమొళిపై ఈడీ చార్జీషీట్ నమోదు!

2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంతో సంబంధమున్న మానీలాండరింగ్ కేసులో టెలికాం శాఖా మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమెళిలతోపాటు మరో 17 మందిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జీషీట్ దాఖలు చేసింది.

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంతో సంబంధమున్న మానీలాండరింగ్ కేసులో టెలికాం శాఖా మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమెళిలతోపాటు మరో 17 మందిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జీషీట్ దాఖలు చేసింది. 
 
డీఎంకే సుప్రీం ఎం కరుణానిధి భార్య దయాల్ అమ్మాళ్, స్వాన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్ షాహీద్ ఉస్మాన్ వినోద్ గోయెంకాల పేర్లను  చార్జీషీట్ లో ఈడీ దాఖలు చేసింది. 
 
డీఎంకే పార్టీకి చెందిన కలైంజర్ టీవీకి రెండు వందల కోట్ల ముడుపులు చెల్లించారనే ఆరోపలు వచ్చిన సంగతి తెలిసిందే. కుసేగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు అసిఫ్ బల్వా, రాజీవ్ అగర్వాల్, బాలీవుడ్ నిర్మాతలు కరీమ్ మోరానీ, కలైంజర్ టీవీ ఎండీ శరద్ కుమార్ లను నిందితులుగా చేర్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement