షారూక్‌ ఖాన్‌ కేకేఆర్‌ జప్తు! | ED attaches Rs 70 crore assets of 3 firms in Rose Valley scam | Sakshi
Sakshi News home page

షారూక్‌ ఖాన్‌ కేకేఆర్‌ జప్తు!

Feb 4 2020 5:51 AM | Updated on Feb 4 2020 5:51 AM

ED attaches Rs 70 crore assets of 3 firms in Rose Valley scam - Sakshi

న్యూఢిల్లీ: రోజ్‌వ్యాలీ స్కామ్‌పై విచారణలో భాగంగా రూ.70 కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం ప్రకటించింది. బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పోర్ట్స్‌ లిమిటెడ్‌ (కేకేఆర్‌)తోపాటు మల్టిపుల్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సెయింట్‌ జేవియర్స్‌ కాలేజ్‌లు జప్తు అయిన ఆస్తుల్లో ఉన్నట్లు ఈడీ తెలిపింది. జప్తు అయిన మూడు ఆస్తుల తాలూకు ఖాతాల్లో దాదాపు 16.20 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, ఇందులో రూ.11.87 కోట్లు షారూక్‌ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌దని వివరించారు. ఐపీఎల్‌ క్రికెట్‌ టీమ్‌ యాజమాన్య కంపెనీలో షారూక్‌ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్, సినీనటి జూహీ చావ్లా భర్త జై మెహతా సీఈవో వెంకటేష్‌ మైసూర్‌లతోపాటు మరో ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. కేసుకు సంబంధించి మైసూర్‌ను గత  అక్టోబరులో ఈడీ ప్రశ్నించిన విషయం తెల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement