
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్,హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్ర 4:30 నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రంగా భూప్రకంపనలు వచ్చాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండిలో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదుగా నమోదయింది. దీంతో కశ్మీర్లోని పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో ప్రకంపనలు మరికొంత తీవ్రంగా నమోదయ్యాయి.