హిందూఖుష్‌లో భూకంపం; వణికిన ఉత్తర భారతం | earthquake in Afghanistan's Hindu Kush; tremors felt in Delhi | Sakshi
Sakshi News home page

హిందూఖుష్‌లో భూకంపం; వణికిన ఉత్తర భారతం

Jan 31 2018 1:19 PM | Updated on Mar 28 2019 6:10 PM

earthquake in Afghanistan's Hindu Kush; tremors felt in Delhi - Sakshi

న్యూఢిల్లీ : దేశరాజధాని సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. అఫ్ఘనిస్థాన్‌లోని హిందూఖుష్‌ ప్రాంతంలో సంభవించిన భూకంపమే ఇందుకు కారణమని తెలిసింది.

హిందూఖుష్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదయిదని యూరప్‌-మధ్యధరా భూకంప కేంద్రం ఒక ప్రకటన చేసింది. జమ్ముకశ్మీర్‌లోనూ భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సిఉంది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనల ప్రభావం ఏమిటన్నది వెల్లడికావాల్సిఉంది.

Advertisement
 
Advertisement
Advertisement