408 రైల్వేస్టేషన్లలో ఈ కేటరింగ్ సదుపాయం | E catering facilities at 408 railway stations | Sakshi
Sakshi News home page

408 రైల్వేస్టేషన్లలో ఈ కేటరింగ్ సదుపాయం

Mar 16 2016 1:56 AM | Updated on Sep 3 2017 7:49 PM

408 రైల్వేస్టేషన్లలో ఈ కేటరింగ్ సదుపాయం

408 రైల్వేస్టేషన్లలో ఈ కేటరింగ్ సదుపాయం

ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు మంగళవారం నాలుగు కొత్త సర్వీసుల్ని ప్రారంభించారు.

న్యూఢిల్లీ: ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు మంగళవారం నాలుగు కొత్త సర్వీసుల్ని ప్రారంభించారు. 45 స్టేషన్లకే పరిమితమైన ఈ-కేటరింగ్ సర్వీసులను 408 స్టేషన్లకు విస్తరించామంటూ రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

కేటరింగ్ విభాగంలో స్వయం సహాయక బృందాలకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించింది.  అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు ఈ-టికెట్ బుకింగ్ సదుపాయాన్ని రైల్వే మంత్రి ప్రారంభించారు. సరకు రవాణాను పెంచేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. గూడ్స్ రైళ్ల  ప్రయాణ దూరాన్ని 400 నుంచి 600  కి.మీ.కు పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement