ఫిట్‌నెస్‌ చాలెంజ్‌; సరికొత్త సంచలనం! | Drunk Man FitnessChallenge In Rain Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ చాలెంజ్‌; సరికొత్త సంచలనం!

Jun 5 2018 2:35 PM | Updated on Jun 5 2018 8:48 PM

Drunk Man FitnessChallenge In Rain Video Goes Viral - Sakshi

బెల్గావి: ‘డాన్సింగ్‌ అంకుల్‌’ను తలదన్నే రీతిలో ‘అల్టిమేట్‌ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌’ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ నుంచి ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ల పరంపర మొదలుకావడం, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను స్వీకరించడం, సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా వరుసగా వీడియోలు పోస్ట్‌ చేస్తున్నక్రమంలో.. హోరువానలో నడిరోడ్డుపై నిలబడి ఈ పెద్దాయన చేసిన విన్యాసాలను నెటిజన్లు విపరీతంగా షేర్‌ చేసుకుంటున్నారు.

ఫుల్‌గా మద్యం సేవించి ఫిట్‌నెస్‌ చాలెంజ్‌: కడుపునిండా మద్యం సేవించి, ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఈ పెద్దాయన చేసిన విన్యాసాలకు నెటిజన్లు ‘ఫిట్‌నెస్‌ చాలెంజ్‌’తో పోల్చుతున్నారు. కాసేపు పుషప్స్‌ కొట్టి.. మరికాసేపు ఆకాశంతో అలౌకిక సంభాషణచేసి.. మళ్లీ పుషప్స్‌ కొట్టి.. తొగడొట్టి... చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. కర్ణాటకలోని బెల్గావి పట్టణంలో ఈ వీడియోను చిత్రీకరించారు.

అక్కడ భారీ వర్షాలు: కర్ణాటకలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుముకురు, ధావన్‌గిరి, కలబుర్గి, ధర్వాడ్‌, హుబ్లీ, గదగ్‌ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల జనజీవనం అస్తవ్యవస్థమైపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement