దీని దర్జాయే వేరు.. అదిరేలా టాప్‌పై షికారు | Dog Stands On Top Of Moving Auto Like A Boss | Sakshi
Sakshi News home page

దీని దర్జాయే వేరు.. అదిరేలా టాప్‌పై షికారు

Oct 14 2017 3:03 PM | Updated on Sep 29 2018 4:26 PM

Dog Stands On Top Of Moving Auto Like A Boss - Sakshi

ముంబయి : మనుషులే కాదు.. జంతువులు కూడా దర్జాగా కనిపించగలవు.. సాధారణంగా నడుస్తున్న వాహనాల టాప్‌పై నిల్చొని హుందాగా వస్తుంటే ఆ వ్యక్తిని చూసి డాన్‌ ఏమో అనుకుంటాం. కానీ, అదే వాహనాలపై ఏ మాత్రం భయం లేకుండా హుందాగా ఓ కుక్క ప్రయాణించడం ఎప్పుడైనా చూశామా.. కానీ, ఇది జరిగింది.

ముంబయిలోని రద్దీ రోడ్డులో వేగంగా వెళుతున్న ఓ ఆటోపై ఓ కుక్క తానే బాస్‌, తానే ఓడాన్‌ అనే తీరుగా పోజిచ్చి ప్రయాణించడం కనిపించింది. ఇంకేముంటుంది.. ఆ చిత్రాన్ని మలిష్కా అనే ఓ రేడీయో జాకీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఆ ఫొటో, వీడియో తెగ వైరల్‌ అయింది. కొంతమంది వావ్‌ అమేజింగ్‌ అని అనగా.. ఇంకొందరేమో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దాన్ని కొనయాడారు. మరికొందరు మాత్రం అలాంటి చర్యతో కుక్కకు చాలా ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement