ఎన్‌ఎంసీ తొలి చీఫ్‌గా సురేశ్‌ | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంసీ తొలి చీఫ్‌గా సురేశ్‌

Published Fri, Jan 3 2020 8:38 AM

Doctor Suresh Chandra Sharma Appointed as NMC Chairman  - Sakshi

న్యూఢిల్లీ: వైద్య విద్య నియంత్రణ సంస్థ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ)కు తొలి చీఫ్‌ను కేంద్రం ఎంపిక చేసింది. ఢిల్లీ ఎయిమ్స్‌(ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్‌ సురేశ్‌ చంద్ర శర్మను ఎన్‌ఎంసీ చైర్మన్‌గా నియమించింది. నియామకాల కేబినెట్‌ కమిటీ శర్మ నియామకానికి ఆమోదం తెలపడంతో కేంద్ర సిబ్బంది శాఖ ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. శర్మ మూడేళ్ల పాటు కానీ లేదా తనకు 70 ఏళ్ల వయసు వచ్చేవరకు కానీ ఆ పదవిలో ఉంటారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2018లో ఎంసీఐని రద్దు చేశారు. సంబంధిత విధి నిర్వహణ కోసం ప్రత్యామ్నాయంగా బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఎన్‌ఎంసీకి ఒక చైర్‌ పర్సన్, 10 మంది ఎక్స్‌ అఫిషియొ సభ్యులు ఉంటారు.

Advertisement
 
Advertisement
 
Advertisement