ఉచిత బియ్యంతో సోమరులవుతున్నారు!

Do not give Tamils free rice, they are becoming lazy - Sakshi

చెన్నై: ధనిక, పేద తేడా లేకుండా అందరికీ ప్రభుత్వం రేషన్‌ బియ్యం ఇస్తుండటంతో ప్రజలు బద్దకస్తులుగా మారుతున్నారని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత బియ్యం అందేలా నిబంధనలు సవరించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రజా పంపిణీ పథకం బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడంటూ పోలీసులు ఓ వ్యక్తిని గూండా చట్టం కింద నిర్బంధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. ధనిక, పేద ఇలా అందరికీ ఉచిత బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,110 కోట్లు ఖర్చుచేసింది. దీంతో ‘కనీస సౌకర్యాలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం వీటిని అందరికీ ఇస్తున్నాయి. దీంతో ప్రజలు బద్దకస్తులుగా మారారు’ అని కోర్టు పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top