డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌ కన్నుమూత

DMK general secretary K Anbazhagan passes away at 97 - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్‌ (98) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అన్బళగన్‌ మృతితో పార్టీ కార్యక్రమాలను శనివారం నుంచి వారం రోజులపాటు వాయిదా వేసినట్లు డీఎంకే ప్రధాన కార్యాలయం ప్రకటించింది. అన్బళగన్‌ పార్థివదేహంపై డీఎంకే పతాకాన్ని కప్పారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పార్టీనేతలు కనిమొళి, దురైమురుగన్‌ నివాళులర్పించారు. కరుణానిధికి మిత్రుడిగా మెలిగిన అన్బళగన్‌ గత 43ఏళ్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top