దిగ్విజయ్ కి రెండో పెళ్లి! | Digvijay confirms 'special relation' with TV anchor | Sakshi
Sakshi News home page

దిగ్విజయ్ కి రెండో పెళ్లి!

Apr 30 2014 3:09 PM | Updated on Aug 14 2018 3:55 PM

దిగ్విజయ్ కి రెండో పెళ్లి! - Sakshi

దిగ్విజయ్ కి రెండో పెళ్లి!

సోషల్ మీడియాలో పుట్టిన కాంట్రవర్సీకి దిగ్విజయ్ సోషల్ మీడియాలోనే ఫుల్ స్టాప్ పలికారు.

ఎన్నికల వేళ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇమేజిని దెబ్బతీసే చిత్రాలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేయడం కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. టీవీ యాంకర్ అమృతారాయ్ తో ఆయనకున్న 'సాన్నిహిత్యాన్ని' ఎత్తి చూపే ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే దిగ్విజయ్ సింగ్ 'అవును ... నిజమే... నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని అంగీకరించేసి పెద్ద కాంట్రవర్సీకి చిన్న ఫుల్ స్టాప్ పెట్టి సరిపుచ్చారు.

నాకు అమృతారాయ్ కి సాన్నిహిత్యం ఉంది. ఆమె ప్రస్తుతం భర్తతో విడాకులు తీసుకోబోతుంది. అది జరిగాక నేను ఆమెను వివాహం చేసుకుంటాను' అని దిగ్విజయ్ ట్విట్టర్ లో ప్రకటించారు. అమృతారాయ్ కూడా ఇదే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో పుట్టిన కాంట్రవర్సీకి దిగ్విజయ్ సోషల్ మీడియాలోనే ఫుల్ స్టాప్ పలికారు.

 తమాషా ఏమిటంటే ఇటీవలే నరేంద్ర మోదీ వైవాహిక స్థాయి విషయంలో దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'తన భార్యకు న్యాయమైన హక్కును కల్పించలేని మోడీకి వోటేయకండి. ఆయన్ని మహిళలు ఎలా నమ్మగలరు?' అని ఆయన విమర్శించారు. దిగ్విజయ్ భార్య ఆశాసింగ్ గతేడాది క్యాన్సర్ తో మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement