ఢిల్లీలో డీజిల్‌ ఇంజిన్లు మరో ఏడాదే!   | diesel engines in delhi are another year | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో డీజిల్‌ ఇంజిన్లు మరో ఏడాదే! 

Feb 4 2018 1:54 AM | Updated on Sep 28 2018 3:27 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రాంతంలో 2019 మార్చి తర్వాత డీజిల్‌ ఇంజిన్‌తో నడిచే రైలు ఒక్కటి కూడా ఉండదని అధికారులు తనకు చెప్పినప్పినట్లు రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ వెల్లడించారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా డీజిల్‌ ఇంజిన్ల వాడకాన్ని నిలిపేసేందుకు కృషి చేస్తున్నామనీ, ఆ తర్వాత నుంచి అన్ని రైళ్లనూ విద్యుత్తు ఇంజిన్లతోనే పరుగులు తీయిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి రైల్వే 279 విద్యుత్తు ఇంజిన్‌లను అందుబాటులోకి తెచ్చిందనీ, ఈ సంఖ్యను వెయ్యికి పెంచాల్సి ఉందని గోయల్‌ చెప్పారు. 2019 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా డీజిల్‌ ఇంజిన్ల స్థానంలో విద్యుత్తు ఇంజిన్లను ప్రవేశపెడితే రైల్వేకు ఏడాదికి రూ.11,500 కోట్లు ఆదా అవడంతోపాటు రైళ్ల వేగం కూడా స్వల్పంగా పెరుగుతుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement