శబరిమలలో భక్తులకు నో ఎంట్రీ

Devotees not to be allowed into Sabarimala temple - Sakshi

తిరువనంతపురం: అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా జూన్‌ 14న తెరవనున్న శబరిమల ఆలయాన్ని పూజా కార్యక్రమాల అనంతరం తిరిగి మూసివేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 19 నుంచి 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలను సైతం వాయిదా వేస్తున్నట్టు మంత్రి సురేంద్రన్‌ వెల్లడించారు. 14 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని ఇటీవల ట్రావెన్‌కోర్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బోర్డు అధికారులు, ఆలయ పూజారులు, కేరళ ప్రభుత్వం సమావేశం అయి ఆలయం తెరవాలన్న ఆలోచనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో భక్తులకు ఆలయ ప్రవేశం లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top