మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం | devendra fadnavis takes oath as maharashtra cm | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం

Oct 31 2014 4:33 PM | Updated on Oct 8 2018 5:57 PM

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం - Sakshi

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం

మహారాష్ట్రలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ రావు ఫడ్నవిస్ శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు.

మహారాష్ట్రలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ రావు ఫడ్నవిస్ శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె, గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరయ్యారు.

సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, లతా మంగేష్కర్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఎన్సీపీ నాయకులు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement