ఢిల్లీ అల్లర్లు: ఆ తల్లి పిల్లలతో సహా..!

Delhi violence We were Molested Mob Tore Our Clothes  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఢిల్లీలో జరుగుతున్న ఘటనలతో ఏ క్షణం ఏ జరుగుతుందో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. సీఏఏకు అనుకూలంగా వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో మహిళలు, చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రాణాల్ని సైతం లెక్కపెట్టకుండా ఎత్తయిన భవనం మీద నుంచి దూకేసింది. ఇటువంటి ఘటనలు ఢిల్లీలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. చదవండి: ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ

ఆందోళనకారులు విచక్షణ మరిచి ఇళ్లలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నారు. ఢిల్లీలోని కరవాల్‌నగర్‌లో ఎన్‌జీఓ నడుపుతున్న ఓ మహిళ ఇంటిని ఆందోళన కారులు చుట్టుముట్టడంతో తన ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవడం కోసం​ ఆమె మొదటి అంతస్తు పై నుంచి దూకేసింది. ఈ ప్రమాదంలో వారికి గాయాలైనా ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విధంగా ఆందోళనకారులు నుంచి తప్పించుకున్న వారు అయూబ్‌ అహ్మద్‌ అనే కిరాణాషాపు యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారు. అనంతరం వారిని కష్టంమీద ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: మిరాకిల్‌ బాబు..!

అయితే అయూబ్‌ ఇంట్లో వారు తలదాచుకున్నారన్న విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆమె అక్కడ కనిపించకపోవడంతో ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. తన ఇంటికి దగ్గరలో ఉండే వ్యక్తిపై యాసిడ్‌ చల్లారని అతను తీవ్ర గాయాలపాలయ్యాడని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో వారు మా ఇంటికి మీదకి దాడికి వస్తుండటంతో తన ఇద్దరు కుమార్తెలతో మొదటి అంతస్తు నుంచి దూకి ముస్లింలు నివసించే ప్రాంతానికి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: ఢిల్లీ అల్లర్లు: వివాహమైన 12 రోజులకే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top