ఢిల్లీ అల్లర్లు : వివాహమైన 12 రోజులకే..

Bride Loses Her Husband To Riots After 12 Days - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 42కు చేరింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఈ ఘర్షణలో మృతి చెందిన వారి వివరాలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నాయి. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ జంటను.. ఢిల్లీ అల్లర్లను శోకసంద్రంలో ముంచాయి. ముస్తాఫాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే ఆష్వాక్‌ హుస్సేన్‌కు ఫిబ్రవరి 14నే వివాహమైంది. 21ఏళ్ల తస్లీన్ ఫాతిమా ప్రేమ జంట ఎంతో ఇష్టపడే వాలెంటైన్స్ డే రోజున 22 ఏళ్ల ఆష్వాక్‌ హుస్సేన్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ సీఏఏ అల్లర్లను వారి పాలిట శాపంగా మారాయి. ఫిబ్రవరి 25న భోజనం చేసి బయటకు వెళ్లిన ఆష్వాక్‌ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి జరిగిన 12 రోజులకే అతను విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. (ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ)

తాజాగా ఆష్వాక్‌ చిత్రాన్ని తస్లీన్‌ సోషల్‌ మీడియాలో తొలిసారి షేర్‌ చేశారు. అత్తారింటికి వచ్చిన తొలి రోజే భర్త చనిపోవడం.. అసలు భర్త గురించి కూడా పూర్తి వివరాలు తెలియకుండానే విడిచి వెళ్లిపోయాడంటూ  ఫాతిమా  కన్నీరుమున్నీరవుతున్నారు. పని ముగించుకుని ఇంటికి వస్తున్న అష్వాక్‌ను పొడిచి చంపారని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆష్వాక్‌ మృతి విషయం వారి కుటుంబ సభ్యులకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఘర్షణలో గాయపడ్డ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతను మృతి చెందడం, పోస్ట్‌మార్టం వంటి కార్యక్రమాలన్నీ వారి కుటుంబ సభ్యులకు తెలయకుండానే చకచకా జరిగిపోయాయి. ఫోన్ చేసి పోస్టు మార్టం పూర్తయిందని,  శవాన్ని తీసుకెళ్లమంటూ పోలీసులు చెప్పేవరకూ వారికి సమాచారం లేకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ బదిలీ ఓ శేష ప్రశ్న!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top