చావు టచ్ చేయలేదన్నాడు.. తల పేలిపోయింది | Delhi Man Shoots Himself Dead During Game Of Russian Roulette | Sakshi
Sakshi News home page

చావు టచ్ చేయలేదన్నాడు.. తల పేలిపోయింది

Feb 9 2016 6:35 PM | Updated on Sep 3 2017 5:17 PM

చావు టచ్ చేయలేదన్నాడు.. తల పేలిపోయింది

చావు టచ్ చేయలేదన్నాడు.. తల పేలిపోయింది

ఢిల్లీలో మహా నేరగాడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. పిలిచిమరీ స్నేహితులతో ఆడిన రష్యా తరహా పందెం అతడి ప్రాణాలను హరించింది.

న్యూఢిల్లీ: ఢిల్లీలో మహా నేరగాడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. పిలిచిమరీ స్నేహితులతో ఆడిన రష్యా తరహా పందెం అతడి ప్రాణాలను హరించింది. ఢిల్లీకి చెందిన రామ్ మహేర్ అలియాస్ రంబీర్ అనే నేరగాడు గత ఆదివారం రాత్రి తన స్నేహితులను ఉత్తమ్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ కోసం మద్యం తాగేందుకు పిలిచాడు. అనంతరం తన స్నేహితులతో రష్యా తరహాలో 'గేమ్ ఆఫ్ డెత్' ఆడాలంటూ చాలెంజ్ చేశాడు.

తొలుత తుపాకీలోని బుల్లెట్లు అన్ని తీశాడు. ఆ తర్వాత ఒక బుల్లెట్ మాత్రం అందులో పెట్టి సిలిండర్ తిప్పడం ప్రారంభించాడు. అది తిరగడం ఆగిపోయిన తర్వాత 'చావు నన్ను టచ్ కూడా చేయలేదు' అని వ్యాఖ్యానిస్తూ పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టుకొని ట్రిగ్గర్ నొక్కాడు. అదృష్టం కొద్ది ఆ సమయంలో బుల్లెట్ రాలేదు. అలాగే మరో రెండుసార్లు ప్రయత్నించి కూడా బుల్లెట్ దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. కానీ, నాలుగో సారి మాత్రం అతడిని దురదృష్టం వెంటాడింది.

అందులోని ఒక్క బుల్లెట్ నేరుగా తలలోకి దూసుకెళ్లి ఆ భాగాన్ని చిద్రం చేసింది. అలా స్నేహితుల ముందే రక్తపు మడుగుల పడ్డాడు. పోలీసులకు ఈ సమాచారం అందించిన స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందిస్తూ 'మేం శవ పరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. ఇందులో ఎవరూ కుట్ర చేసినట్లు మా ప్రాథమిక దర్యాప్తులో తేలలేదు. అయితే, ఆరోజు పార్టీకి వెళ్లినవారిని, రంబీర్ సోదరుడిని ప్రశ్నిస్తున్నాం' అని ఢిల్లీ కమిషనర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement