ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. రాకపోకలకు అంతరాయం

Delhi Airport On Hold  Flights Diverted over heavvy Fog - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయు కాలుష్యంతో ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడితే తాజాగా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో గురువారం రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా గురువారం ఉదయం 7.30 నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు వల్ల 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌, బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌, ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌, పూర్వ ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ గుర్గావ్‌ ఎక్స్‌ ప్రెస్‌ వేస్‌ లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top