
అపర భగీరథుడు..!
మంచి పని చేయాలని మనసులో కోరిక పుట్టాలే కానీ, వయసుదేముంది..?
మంచి పని చేయాలని మనసులో కోరిక పుట్టాలే కానీ, వయసుదేముంది..? రామాకృష్ణా అనుకోవాల్సిన వయసులోనూ శక్తులన్నీ కూడదీసుకుని సేవ చేయవచ్చు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం అదే చేస్తున్నాడు ఓ పెద్దాయన. హారుుగా రిటైరరుు్య కాలుమీద కాలేసుకుని కూర్చునే వయసులో ప్రజల కోసం అపర భగీరథుడి అవతారమెత్తాడు. కరిగిపోతున్న హిమనీనదాలను ఒడిసిపట్టి బంజరు భూముల్ని సస్యశ్యామలం చేస్తున్నాడు. తాగడానికి చుక్కనీరు లేని పరిస్థితి నుంచి జలసిరులను సృష్టించాడు..!
చ్యూవాంగ్ నోర్ఫెల్‌ది మధ్యతరగతి కుటుంబం. లడఖ్‌లోని లేహ్‌లో నివాసం. లక్నోలో సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా చదివాడు. జమ్మూ కాశ్మీర్ గ్రామీణాభివృద్ధి శాఖలో 35 ఏళ్లపాటు పనిచేశాడు. 1995లో రిటైర్ అయ్యాడు. అరుునా తను చేస్తున్న పని ఆపలేదు. అప్పుడు గవర్నమెంటు ఉద్యోగిగా.. ఇప్పుడు ప్రజలకోసం స్వచ్ఛందంగా..!
లడఖ్‌లో కనీసం ఒక రోడ్డు వేయలేదు. కల్వర్టు నిర్మించలేదు. బ్రిడ్జి వేయలేదు. అందుకే వాటన్నిటికి పరిహారంగా నీటి సమస్య తీర్చాలని భావించాడు నోర్ఫెల్. పైగా అక్కడి ప్రజలకు అన్నిటికంటే నీరే ప్రధాన సమస్య. ఏ కాలమైనా అదే పరిస్థితి. అందుకే ఆ దిశగా నడుంకట్టాడు. హిమనీనదాలు కరుగుతాయన్న మాటేగానీ.. ఆ నీళ్లు అక్కడికి చేరుకోలేవు.
అంతకంతకూ పెరుగుతున్న కాలుష్యం గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతోంది. గ్రామాల్లో నీటి కొరత ఏర్పడి జనం పట్టణాల బాట పడుతున్నారు. ఫలితంగా రూరల్ ఎకానమీ పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నోర్ఫెల్ ఒక సత్కార్యానికి నడుం బిగించాడు. కృత్రిమ హిమనీనదాలు క్రియేట్ చేయాలని భావించాడు. చిన్న చిన్న ఆనకట్టల ద్వారా నీరు నిల్వ ఉండేలా చేశాడు. అలా ఇప్పటిదాకా 12 హిమనీనదాలను సృష్టించాడు. ఫలితంగా కొంత భూమి సాగులోకి వచ్చింది. భూగర్భ జలాలూ పెరిగారుు. సుమారు వంద గ్రామాలకు నీటి కరువు లేకుండా చేశాడు.
నోర్ఫెల్ చేసిన కృషికి గానూ 2015లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇప్పుడు అందరూ అతడిని మంచు మనిషి అని పిలుస్తున్నారు. అవార్డులు రివార్డులు వచ్చాయని ఆయన పని ఆపలేదు. ఎక్కడ నీటి సమస్య ఉందో తెలుసుకుని అక్కడ ఒక కాలువ సృష్టిస్తున్నాడు. భవిష్యత్ తరాలు నీటికోసం ఇబ్బంది పడకూడదనేదే నోర్ఫెల్ నమ్మిన సిద్ధాంతం. దానికోసం ఆయన ఎంత శ్రమకై నా వెనుకాడడు. ఈ పెద్దాయనకు హ్యాట్సాఫ్ చెబుదాం..!