మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ అధికారి హతం | CRPF officer killed in anti-Naxal operation | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ అధికారి హతం

Jul 4 2014 10:55 AM | Updated on Aug 11 2018 9:02 PM

జార్ఖండ్లోని గిరిధ్ జిల్లాలో మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు మరణించారు.

జార్ఖండ్లోని గిరిధ్ జిల్లాలో మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున జార్ఖండ్ రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు కలిసి గిరిధ్ జిల్లాలోని లాఖేరి ప్రాంతంలో కూంబింగ్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.  పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్కు చెందిన సెకండ్ ఇన్ కమాండ్ హెచ్కె ఝా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం గాయాలతో ఆయన మరణించారు. ఈ దాడిలో మరెవ్వరూ గాయపడలేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్ సందర్భంగా ఇద్దరు మావోయిస్టులను కొన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో మరింత ముమ్మరంగా గాలింపు జరుపుతున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement