చెవి కొరికి తిన్నావు.. బెయిల్ ఎలా ఇస్తాం?.. సుప్రీంకోర్టు ఫైర్‌ | You Bit Off His Ear, Ate It: Supreme Court Fires While Rejecting Bail Petition | Sakshi
Sakshi News home page

చెవి కొరికి తిన్నావు.. బెయిల్ ఎలా ఇస్తాం?.. సుప్రీంకోర్టు ఫైర్‌

Oct 14 2026 7:21 PM | Updated on Oct 14 2026 7:58 PM

You Bit Off His Ear, Ate It: Supreme Court Fires While Rejecting Bail Petition

సాక్షి,న్యూఢిల్లీ: ఓ వ్యక్తి చెవిని కొరికి తిన్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘చెవిని కొరికి మొత్తం తీసేశావు.. ఇప్పుడు అతడి చెవిని ఎలా తిరిగి తీసుకొస్తావు?’ అంటూ నిందితుడి తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.

2024లో జార్ఖండ్‌లోని రాంచీలో నమోదైన కేసుకు సంబంధించి రాజీవ్ రంజన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జన్మాష్టమి వేడుకల సమయంలో పొరుగువారి మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారినట్లు కేసులో ఆరోపణలున్నాయి.

తొలుత తుపాకీ తీసి బెదిరించి, ఆ తర్వాత బాధితుడి చెవిని కొరికి వేరు చేశావంటూ నిందితుడిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.  అయితే దానికి తుపాకీ ఆరోపణలు అవాస్తవమని న్యాయవాది వాదించగా.. ‘తుపాకీ సంగతి పక్కన పెడదాం.. చెవి సంగతేంటి? దాన్ని తిరిగి ఎలా తీసుకురాగలం?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

దాంతో తన క్లయింట్‌పైనా దాడి జరిగిందని, తన ఛాతీపై గాయాలయ్యాయని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆ వాదనలతో సంతృప్తి చెందని సుప్రీంకోర్టు నిందితుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బాధితుడి తల, ముఖంపై పలు గాయాలున్నట్లు పోలీసుల నివేదికలో పేర్కొన్న విషయాన్ని గతంలో జార్ఖండ్ హైకోర్టు కూడా ప్రస్తావించింది.

ఇదీ చదవండి: రైల్వే ఉద్యోగులకు పండుగ బోనస్‌.. ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement