భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా!

covid transmission rate paces up in india - Sakshi

సాక్షి, చెన్నై: భారత్​లో కోవిడ్​–19 వ్యాప్తి రేటు బాగా పెరిగిందట. మార్చి నెలతో పోల్చుకుంటే ప్రస్తుత వ్యాప్తి రేటులో గణనీయమైన మార్పులు ఉన్నాయని చెన్నైకి చెందిన గణితశాస్త్ర సంస్థ(ఐఎంఎస్‌) చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. మార్చి నెల 4వ తేదీ నుంచి కరోనా వైరస్​ వ్యాప్తి రేటు 1.83 కంటే తక్కువగా నమోదైందని చెప్పింది. కానీ అన్​లాక్​ 2 ప్రారంభమైన జూలైలో వ్యాప్తి రేటులో పెరుగుదల కనిపించిందని తెలిపింది. ప్రభుత్వం కోవిడ్​ వ్యాప్తి రేటును 1కి తేవాలని భావిస్తోందని వెల్లడించింది. (లైవ్ వీడియోలో స్నానం చేస్తూ అడ్డంగా..)

ప్రస్తుతం కరోనా వ్యాప్తి రేటు సంఖ్య 1.19గా ఉంది. అంటే సగటున వైరస్​ సోకిన వ్యక్తి 1.19 మందికి దాన్ని వ్యాప్తి చేస్తున్నాడని అర్థమని ఆ సంస్ధకు చెందిన డాక్టర్‌ సితాబ్ర సిన్హా వెల్లడించారు. వ్యాప్తిలో హెచ్చుతగ్గులను తెలుసుకోవడానికి కనీసం 10 నుంచి 14 రోజులు పడుతుందని ఆమె వివరించారు. జూన్​ నెల రెండో అర్ధభాగం, జులై ప్రారంభంలో జరిగిన అనేక పరిణామాలు కోవిడ్ వ్యాప్తి రేటును పెంచాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు బాగానే ఉన్నాయన్నారు. ఢిల్లీ, హరియాణాల్లో వ్యాప్తి రేటు సాధారణంగానే ఉందని తెలిపారు.(చేప‌ల వ్యాపారి నుంచి 119 మందికి క‌రోనా)

మార్చి నెలలో ఇండియాలో వ్యాప్తి రేటు 1.83గా ఉంది. ఇదే టైంలో వుహాన్​లో 2.14, ఇటలీలో 2.73గా ఉంది. ఏప్రిల్​ 6న ఇండియాలో 1.55గానూ, ఏప్రిల్ 11న 1.49గానూ ఉంది. జూన్​ ప్రారంభంలో 1.2కి తగ్గింది.  జూన్​ 26న 1.11గా నమోదైంది. మళ్లీ జులై ప్రారంభంలో 1.19కి పెరిగిందని సిన్హా వివరించారు. సంస్ధ అంచనాల ప్రకారం ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ వరుసగా 1.66, 1.65, 1.32 అధిక వ్యాప్తి రేటుతో ఉన్నాయి. గతంలో అత్యధిక వ్యాప్తి రేటు కలిగిన గుజరాత్​, వెస్ట్​ బెంగాల్​లో ప్రస్తుతం వైరస్​ వ్యాప్తి వేగం తగ్గినట్లు సిన్హా చెప్పారు.

తన అంచనా ప్రకారం జులై నెలాఖరుకి దేశవ్యాప్తంగా ఆరు లక్షల యాక్టివ్​ కరోనా కేసులు ఉంటాయని పేర్కొన్నారు. జులై 21 నాటికి మహారాష్ట్రలో కేసులు 1.5 లక్షలకు, తమిళనాడు లక్షకు చేరొచ్చని సిన్హా అంచనా వేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

09-08-2020
Aug 09, 2020, 11:02 IST
కాలిఫోర్నియా : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా...
09-08-2020
Aug 09, 2020, 10:17 IST
సాక్షి, ఢిల్లీ : దేశంలో క‌రోనా రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్త‌గా 64,399 క‌రోనా పాజిటివ్‌ కేసులు...
09-08-2020
Aug 09, 2020, 08:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆదివారం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌...
09-08-2020
Aug 09, 2020, 08:27 IST
సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా మహమ్మారి మొదలైనప్పట్నుంచి జీవితంలో ఎన్నడూ చూడని అమానవీయ సంఘటనల్ని మన కళ్లముందుంచింది. కరోనా వైరస్‌...
09-08-2020
Aug 09, 2020, 08:14 IST
సాక్షి, హైదరాబాద్ ‌: వర్క్‌ ఫ్రం హోం లేదా రిమోట్‌ వర్కింగ్‌.. ఇప్పుడు ఎవరు కలుసుకున్నా, ఫోన్లో పలకరించుకున్నా ఇవే...
09-08-2020
Aug 09, 2020, 04:30 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకుని శనివారం ఒకే రోజు 9,151 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో...
09-08-2020
Aug 09, 2020, 03:51 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఉపముఖ్యమంత్రి,...
09-08-2020
Aug 09, 2020, 03:46 IST
వరుసగా మూడు లేదా నాలుగు రోజుల పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే...
08-08-2020
Aug 08, 2020, 21:10 IST
సాక్షి, న్యూఢిల్లీ :  దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులతో పాటు మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది....
08-08-2020
Aug 08, 2020, 20:53 IST
సాక్షి, వికారాబాద్‌: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జూబ్లీహిల్స్‌లోని...
08-08-2020
Aug 08, 2020, 18:46 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,123 మందికి కరోనా...
08-08-2020
Aug 08, 2020, 16:26 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు....
08-08-2020
Aug 08, 2020, 15:54 IST
ఆరు సార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరు గడించారు.
08-08-2020
Aug 08, 2020, 15:35 IST
ముంబై: ఇటీవల కరోనా బారిన పడిని బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ మహమ్మారిని జయించాడు. గత కొంతకాలంగా కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన‌ చికిత్స తీసుకుంటున్న...
08-08-2020
Aug 08, 2020, 14:18 IST
ఆదిలాబాద్‌టౌన్‌: చనిపోయిన వారికి సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీ.. ఏ కులం, ఏ మతంలోనైనా వారి సాంప్రదాయం...
08-08-2020
Aug 08, 2020, 13:35 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ఆయన...
08-08-2020
Aug 08, 2020, 12:40 IST
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు.
08-08-2020
Aug 08, 2020, 11:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా...
08-08-2020
Aug 08, 2020, 10:19 IST
రాజమహేంద్రరం క్రైం: పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 252 మందికి ఖైదీలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు...
08-08-2020
Aug 08, 2020, 10:02 IST
మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. లాక్‌డౌన్‌ సమయంలో చికెన్‌ తింటే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top