కరోనా నియంత్రణకు కేంద్రం బృహత్తర ప్రణాళిక

Coronavirus: Indian Govt has designed strategic action To Control Covid 19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 4,067 కరోనావైరస్‌ పాటిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 109 కు చేరింది. గడిచిన 12 గంటల్లోనే ఏకంగా 490 మందికి కరోనా వైరస్‌ సోకింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళతో సహా 9 రాష్ట్రాల్లోని 211 జిల్లాలలో కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్దం చేసింది. కరోనావైరస్‌ మరిన్ని ప్రాంతాలకు కరనా విస్తరించే ప్రమాదం పొంచి ఉందనే అంచనాతో కేంద్ర ఆరోగ్య శాఖ వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించింది. (చదవండి : భారత్‌లో 4వేలు దాటిన కరోనా కేసులు)

కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికలోని ముఖ్యాంశాలు

ప్రస్తుతం పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో జన సంచారం లేకుండా చేయడం.

ఆయా ప్రాంతాలకు పూర్తిగా రాకపోకల రద్దు కొనసాగింపు.

చివరి కరోనా  కేసు నమోదైన తర్వాత 4 వారాల వరకు.. కొత్తగా ఎలాంటి పాజిటివ్ కేసు నమోదు కానట్లయితే అప్పుడు మాత్రమే ఆయా ప్రాంతాలలో నెమ్మదిగా సడలింపు.

పాజిటివ్ కేసులుగా నమోదైన వారినందరినీ ఆస్పత్రులకు తరలింపు

రెండు సార్లు జరిపే రక్త పరీక్షలు నెగటివ్‌గా వస్తేనే ..పేషెంట్లను ఆసుపత్రుల నుంచి ఇళ్లకు పంపాలి

కొద్దిపాటి కరనా లక్షణాలు ఉన్న వాళ్లను..స్టేడియంలలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాలకు పంపాలి

కొంచెం ఎక్కువ కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను..అసుపత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులలో ఉంచాలి

కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను దిగ్బంధం చేయడంతో పాటు ఆ ప్రాంతాల నుంచి పక్క ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందకుండా అంచెల వారి  రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి

పాఠశాలలు, కళాశాలలు, ఇతర కార్యాలయాలను చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మూసివేయాలి.

 ►ఈ ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా ను స్తంభింప చేయాలి

కేవలం నిత్యావసర, అత్యవసర సర్వీసులను మాత్రం అనుమతించాలి

కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో..వివిధ విధానాలను అవలంబించాలి

వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి కట్టుదిట్టమైన సర్జికల్ గౌన్లు,  మాస్కులు, గ్లోవ్స్ లాంటి ..మూడు రకాలైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు వినియోగించాలి

కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్లు గా గుర్తించాలి

ఖచ్చితమైన చర్యలు తీసుకునే బాధ్యతను ..సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్లకు అప్పగించాలి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

10-07-2020
Jul 10, 2020, 01:01 IST
ప్రముఖ నిర్మాత, నటుడు ‘రాక్‌లైన్‌’ వెంకటేశ్‌ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారట....
09-07-2020
Jul 09, 2020, 20:21 IST
ఢిల్లీ : ఆసియాక‌ప్ నిర్వ‌హిద్దామ‌నుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) గ‌ట్టి షాక్ ఇచ్చింది. క‌రోనా నేప‌థ్యంలో ఆసియా‌...
09-07-2020
Jul 09, 2020, 19:21 IST
లండన్‌ : కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నసమయంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. కోవిడ్‌-19...
09-07-2020
Jul 09, 2020, 18:48 IST
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఉదృతికి ఢిల్లీలో జ‌రిగిన నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ తబ్లిగీ జమాత్‌ స‌మావేశం ప్ర‌ధాన పాత్ర...
09-07-2020
Jul 09, 2020, 17:10 IST
ముంబై : క‌రోనా రోగుల‌కు అందించే చికిత్సలో భాగంగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి)  ఏర్పాటు చేసిన  ప్లాస్మా...
09-07-2020
Jul 09, 2020, 16:17 IST
న్యూఢిల్లీ :  భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి( క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ ) ద‌శ‌కు చేరుకోలేద‌ని ఆరోగ్య శాఖ...
09-07-2020
Jul 09, 2020, 15:07 IST
ఫ‌రిదాబాద్ :  గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే అనుచ‌రుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. మంగ‌ళ‌వారం దూబె ప్ర‌ధాన అనుచ‌రులు...
09-07-2020
Jul 09, 2020, 14:54 IST
సాక్షి, చెన్నై: భారత్​లో కోవిడ్​–19 వ్యాప్తి రేటు బాగా పెరిగిందట. మార్చి నెలతో పోల్చుకుంటే ప్రస్తుత వ్యాప్తి రేటులో గణనీయమైన...
09-07-2020
Jul 09, 2020, 14:24 IST
కాంటాబ్రియా : క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచంలో ఏ చోట చూసిన వ‌ర్క్ ఫ్రం హోం సాధార‌ణ‌మైపోయింది. వ‌ర్క్ ఫ్రం చేస్తూనే త‌మ‌కు...
09-07-2020
Jul 09, 2020, 13:53 IST
తిరువ‌నంత‌పురం: కేర‌ళలోని పుంథూరా గ్రామంలో మొట్ట‌మొద‌టి క‌రోనా క్ల‌స్ట‌ర్ ఏర్పాటైంది. అత్య‌ధిక సూప‌ర్ స్ప్రెడ‌ర్‌ల‌ను గుర్తించిన అధికారులు వెంట‌నే ఆ...
09-07-2020
Jul 09, 2020, 13:31 IST
వరంగల్‌ క్రైం: కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మేరకు మాస్క్‌ లేకుండా బయటకు రావొద్దని, అత్యవసర పనులపై...
09-07-2020
Jul 09, 2020, 13:14 IST
హైబీపీ వచ్చి మెదడులో బ్లడ్‌ క్లాట్‌ అయిన వ్యక్తి నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. అతడికి ట్రీట్‌మెంట్‌ పేరుతో...
09-07-2020
Jul 09, 2020, 12:38 IST
దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనాను కట్టడిలో మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.
09-07-2020
Jul 09, 2020, 11:14 IST
భారత్‌లో కొనసాగిన కోవిడ్‌-19 కేసుల ఉధృతి
09-07-2020
Jul 09, 2020, 10:11 IST
పట్నా :  క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో బిహార్ రాజ‌ధాని పట్నాలో  లాక్‌డౌన్ విధింపున‌కు కార్య‌చ‌ర‌ణ సిద్ధమైంది. పట్నాలో...
09-07-2020
Jul 09, 2020, 09:14 IST
కర్ణాటక, యశవంతపుర: సీనియర్‌ నటి జయంతి  ఆరోగ్యం కొంతవరకు మెరుగు పడినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడకపోవడం, ఆస్తమా...
09-07-2020
Jul 09, 2020, 08:41 IST
సాక్షి, చెన్నై: కరోనా కట్టడి విధుల్లో ఉన్న కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఒకరు వలంటీరుగా సేవకు వచ్చిన ఓ కళాశాల...
09-07-2020
Jul 09, 2020, 06:43 IST
పంజగుట్ట: ప్రగతి భవన్‌ వద్ద ఓ యువకుడు మెరుపు నిరసన చేశాడు. బుధవారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఓ యువకుడు...
09-07-2020
Jul 09, 2020, 06:33 IST
వేసవి కాలంలో నిమ్మకాయ ధరలుపెరగడం, కోడిగుడ్ల ధరలు తగ్గడంసాధారణమే. కానీ ప్రస్తుతం గ్రేటర్‌లోవీటి వినియోగం భారీగా ఉన్నప్పటికీ ధరలు అందుబాటులోనే...
09-07-2020
Jul 09, 2020, 04:14 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందుతుండగా ఇకపై ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ వైద్యానికి అనుమతించాలని నిర్ణయించారు....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top