కరోనా పోరులో చాలా ముందే మేల్కొన్నాం!

Coronavirus Centre Says India Takes Preemptive Proactive Measures - Sakshi

న్యూఢిల్లీ: ముందస్తు చర్యలు చేపట్టకుండానే లాక్‌డౌన్‌ విధించారనే విమర్శలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. విదేశాల నుంచి వచ్చేవారిని దేశంలోకి ఇష్టారీతిన అనుమతించి.. కూలీనాలీ చేసుకునే పేదలకు రవాణా సదుపాయాలు కూడా కల్పించలేదనే ఆరోపణలు అర్థరహితమని తోసిపుచ్చింది. సమగ్ర ప్రతిస్పందన వ్యవస్థ ద్వారా భారత్‌ కరోనా పోరులో చాలా త్వరగా స్పందించిందని కేంద్రం తెలిపింది. మిగతా అన్ని దేశాల కంటే మెరుగ్గా భారత్‌ క్రీయాశీల, క్రమబద్ధమైన నిర్ణయాలు తీసుకుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారశాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 
(చదవండి: బ్రిటీషు పాలకులకు ‘కోవి​డ్‌’ గండం!)

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ మార్గదర్శకాల ముందే భారత్‌ సరిహద్దుల వెంబడి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని వెల్లడించింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు, విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్‌ చేయడం, అనుమానితుల వీసాలను సస్పెండ్‌ చేయడం వంటి చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. భారత్‌లో తొలికేసు జనవరి 30న నమోదు కాగా.. అంతకు ముందే అంటే జనవరి 18 నుంచే థర్మల్‌ స్క్రీనింగ్‌ చర్యలు చేపట్టామని తెలిపింది. చైనా, హాంగ్‌కాంగ్‌ దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా స్క్రీనింగ్‌ చేశామని చెప్పింది.

‘కోవిడ్‌-19 మహమ్మారికి బలైన ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో తొలి కేసు నమోదైన 25 రోజులకు, 39 రోజులకు ఆయా దేశాలు స్క్రీనింగ్‌ మొదలు పెట్టాయి. కానీ, మనదేశం అంతకన్నా ముందే మేల్కొంది. ఎన్నో క్రియాశీల నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. స్క్రీనింగ్‌తో పాటు అనుమానితులకు స్వీయ నిర్బంధం తప్పనిసరి చేశాం. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి.. క్వారైంటైన్‌లకు లేదంటే ఆస్పత్రికి తరలించాం. టూరిస్టులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు అని తేడా లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూశాం. సంపన్న భారతీయులకు ప్రత్యేక సదుపాయాలేం కల్పించలేదు. రాష్ట్రాలతో కలిసి వైరస్‌ నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టాం.
(చదవండి: వారి పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంది: మంత్రి)

దానిలో భాగంగానే రాష్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి దాదాపు 20 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఆరుసార్లు సమీక్షలు జరిపారు. దేశ వ్యాప్తంగా 30 విమానాశ్రయాల్లో, 12 పెద్దవి, 65 చిన్న నౌకాశ్రయాల్లో, వాటితోపాటు అన్ని సరిహద్దుల్లో స్క్రీనింగ్‌ చేపట్టాం. దాదాపు 36 లక్షల మందికి స్క్రీనింగ్‌ చేశాం’ అని సమాచార ప్రసార శాఖ పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా 873 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 19 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-05-2020
May 24, 2020, 10:52 IST
ఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో వలస కూలీలు ఆకలి దారిద్య్రం ఎంత ధీనావస్థలో ఉందనేది ఈ ఫోటో తెలియజేస్తుంది. సొంతూళ్లకు...
24-05-2020
May 24, 2020, 10:44 IST
న్యూఢిల్లీ : ప్రముఖ పల్మనాలజిస్ట్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ సీనియర్‌ డాక్టర్‌ జితేంద్రనాథ్‌ పాండే కరోనాతో మృతిచెందారు. కరోనా సోకడంతో తన...
24-05-2020
May 24, 2020, 09:34 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు...
24-05-2020
May 24, 2020, 08:24 IST
ముంబై : బాలీవుడ్‌ను కరోనా వైరస్‌ వదలడం లేదు. ఇప్పటికే సింగర్‌ కనికా కపూర్‌, నిర్మాత కరీం మోరాని, ఆయన...
24-05-2020
May 24, 2020, 06:36 IST
సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగిస్తే.. ప్రజా జీవనం స్తంభించి పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవనోపాధి...
24-05-2020
May 24, 2020, 06:32 IST
వాషింగ్టన్‌: ఈఏడాదికి అమెరికాలో తమ చదువులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వర్చువల్‌ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో...
24-05-2020
May 24, 2020, 06:15 IST
ప్రముఖ మలయాళ నటుడు సురేష్‌ గోపి త్వరలోనే ఓ కొత్త మైలు రాయిని అందుకోబోతున్నారు. నటుడిగా 247 సినిమాల వరకూ...
24-05-2020
May 24, 2020, 06:09 IST
‘‘రంగేయడానికి ఒకళ్లు.. జడేయడానికి ఒకళ్లు.. బాగానే ఉంది దర్జా.. హ్హహ్హహ్హ’’.... ‘మహానటి’ సినిమాలోని డైలాగ్‌ ఇది. సావిత్రి పాత్రధారి కీర్తీ...
24-05-2020
May 24, 2020, 05:58 IST
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్‌ స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్‌ కమ్ముల. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి...
24-05-2020
May 24, 2020, 05:50 IST
బెర్లిన్‌: లాటిన్‌ అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ దేశాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల్ని పెంచేస్తోంది. బ్రెజిల్, మెక్సికోలో...
24-05-2020
May 24, 2020, 05:35 IST
రెండు నెలలు దాటిపోయింది ప్రపంచం స్తంభించిపోయి.. సినిమా ఆగిపోయి. పనులు మెల్లిగా మొదలవుతున్నాయి. పరుగులు మెల్లిగా ప్రారంభం కాబోతున్నాయి. సినిమా...
24-05-2020
May 24, 2020, 04:58 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్‌...
24-05-2020
May 24, 2020, 04:52 IST
న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. వరుసగా రెండో రోజు...
24-05-2020
May 24, 2020, 04:33 IST
న్యూఢిల్లీ:   ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్‌ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన...
24-05-2020
May 24, 2020, 04:22 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో మరో 47 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్‌...
24-05-2020
May 24, 2020, 04:19 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మన రాష్ట్రంలో వైరస్‌...
24-05-2020
May 24, 2020, 04:16 IST
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....
24-05-2020
May 24, 2020, 03:17 IST
వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న ఖాళీలను గుర్తించి రిక్రూట్‌మెంట్‌ను వేగంగా చేయాలి. ఎన్ని ఖాళీలుంటే.....
24-05-2020
May 24, 2020, 00:08 IST
‘‘రామ్‌’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్‌ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ...
23-05-2020
May 23, 2020, 22:11 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్‌లో ప్రకటించింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top