లాక్‌డౌన్‌లో ఆకలి చావులను ఆపాలంటే....

Corona Lockdown: Central Government Should Take These Measures - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో అనియత రంగంలో పనిచేస్తోన్న కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాద పరిస్థితి పొంచి ఉంది. అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లక్షా 70వేల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినప్పటికీ ఆ సొమ్ము ఏమాత్రం సరిపోదు. ప్రస్తుత ప్యాకేజీని కూడా పక్కా ప్రణాళికతో అమలు చేయక పోయినట్లయితే ఆశించిన ఫలితాలు అందే అవకాశం లేదు. (రుణ గ్రహీతలకు భారీ ఊరట)

2015–16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ‘ఎంప్లాయ్‌మెంట్‌–అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ సర్వే’ ప్రకారం దేశంలో 80 శాతం మంది అనియత రంగంలో పని చేస్తున్నారు. వారిలో మూడోవంత మంది దినసరి వేతన జీవులే ఉన్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వారందరిని ఆదుకోవాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ చిత్త శుద్ధితో అమలు చేయడంతోపాటు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.  (బ్రేక్ 'కరోనా')

1. వద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఏప్రిల్‌ నెలలోనే మూడు నెలల పింఛను ఇవ్వాలి. సామాజిక భద్రతా పింఛన్లను నెలకు 200 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచాలి.
 

2. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2019–20 సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న బకాయిలను కేంద్రం తక్షణమే విడుదల చేయాలి. ఈ పథకం కింద కార్మికులకు నెలకు పది రోజుల చొప్పున మూడు నెలలపాటు, అంటే నెలకు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలను చెల్లించాలి. ఈ పథకం దేశంలో ఉన్న 14 కోట్ల కార్డుదారులకు సొమ్ము చెల్లించాలంటే లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. (ప్యాకేజీ లాభాలు)

3. జాతీయ ఆహార పథకం కింద, ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి దేశంలో మూడింట రెండొంతుల మంది వస్తున్నారు. రేషన్‌ కార్డుల మంజూరులోనూ కొన్ని లోపాలు, పొరపాట్లు ఉన్నప్పటికీ వారందరికి బయోమెట్రిక్‌ గుర్తింపు అవసరం లేకుండా బియ్యం, గోధుమలు, పప్పులు ముందస్తుగా మూడు నెలలకు సరిపడా పంపిణీ చేయాలి. భారత ఆహార సంస్థ వద్ద భారీ నిల్వలు ఉన్నందున ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు.

4. ప్రజా పంపిణీ వ్యవస్థ కిందనే బడుగువర్గాల ప్రజలకు సబ్బులు, నూనెలు కూడా సరఫరా చేయాలి.

5. అంగన్‌వాడీలు, పాఠశాలలు మూసివేసినందున పిల్లలకు పౌష్టికాహారం సరఫరాలో భగంగా కేరళ రాష్ట్రం తరహాలో ఇళ్లకే గుడ్లు, కర్జూరం ప్యాకెట్లు ఉచితంగా సరఫరా చేయాలి.

6. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి గ్యారంటీ పథకం, ప్రజా పంపిణీ పథకం కిందకు రాని లక్షలాది మంది వలసకార్మికులు ఉన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా పనులు ఉండవు కనుక వారికి ఉపాధి ఉండదు. అలాంటి వారు తమ తమ ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణించి పలు రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయిన విషయం తెల్సిందే. వలసకార్మికులందరికి స్టేడియంలలో, కమ్యూనిటీ హాళ్లలో వసతి ఏర్పాటు చేసి, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలి. ఆహార పంపిణీ కింద సరఫరా చేసే రేషన్‌ సరకులను కూడా ఈ కిచెన్లకు సరఫరా చేయాలి. 

ఇలా అనియత రంగంలో పనిచేసే కార్మికులు, దినసరివేతన జీవులను ఆదుకున్నప్పుడే సంపూర్ణ లాక్‌డౌన్‌ అర్థవంతంగా విజయవంతం అవుతుంది. లేకపోయినట్లయితే కరోనా వైరస్‌ బారిన పడి మరణించే వారికన్నా ఆకలితో అలమటించి చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

02-06-2020
Jun 02, 2020, 04:05 IST
ప్రేయసి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేయడానికి రానా రెడీ అవుతున్నారు. రానా, మిహికాల వివాహం ఈ ఏడాది ఆగస్టు 8న...
02-06-2020
Jun 02, 2020, 04:01 IST
తన అక్క రంగోలి కోసం ఇంటీరియర్‌ డిజైనర్‌ అవతారం ఎత్తారు కంగనా రనౌత్‌. కంగనా డిజైన్‌ చేసిన వాటిని షేర్‌...
02-06-2020
Jun 02, 2020, 03:57 IST
కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని...
02-06-2020
Jun 02, 2020, 03:51 IST
బాలీవుడ్‌ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్‌–వాజిద్‌ (ఈ ఇద్దరూ అన్నదమ్ములు. వాజిద్‌ చిన్నవాడు) లలో ఒకరైన వాజిద్‌ ఖాన్‌ ఇక...
02-06-2020
Jun 02, 2020, 03:48 IST
‘‘ఒక సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో బాగుందని టాక్‌ వస్తే మూడోవారం నుంచి వసూళ్లు పెరిగే రోజులు గతంలో...
02-06-2020
Jun 02, 2020, 03:35 IST
లండన్‌: ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని కరోనా మింగేసింది. టెన్నిస్‌ ప్రియుల్ని ఈ అంశం బాధించింది. అయితే ఫార్ములావన్‌కు...
02-06-2020
Jun 02, 2020, 00:39 IST
సిడ్నీ: ఒకవేళ టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఐపీఎల్‌ ఆడేందుకు తాను సిద్ధమేనని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌...
01-06-2020
Jun 01, 2020, 20:54 IST
తాజా నిర్ణయంతో కేటగిరీలను బట్టి మద్యం ధరలు రూ.2 నుంచి.. రూ.50 వరకు పెరుగనున్నాయి.
01-06-2020
Jun 01, 2020, 20:42 IST
సాక్షి, ముంబై :  లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల పాటు మూతపడ్డ సినిమా కెమెరాలు క్లిక్‌ మనిపించేందుకు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్‌ సినిమాల...
01-06-2020
Jun 01, 2020, 20:41 IST
సాక్షి,  న్యూఢిల్లీ:  కరోనా  వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభంలో  ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను  ఆదుకునేందుకు కార్పొరేట్‌ సంస్థల నుంచి చిన్న...
01-06-2020
Jun 01, 2020, 20:04 IST
సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ  ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్‌ తగిలింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో  అమెజాన్...
01-06-2020
Jun 01, 2020, 19:48 IST
సాక్షి, న్యూఢిల్లీ: నేడు ప్రపంచంలోని పలు దేశాలకు గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి మున్ముందు ప్రపంచ దేశాల్లో టెర్రరిజాన్ని పెంచుతుందని...
01-06-2020
Jun 01, 2020, 19:43 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యేకు కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం జూబ్లీహిల్స్‌లోని...
01-06-2020
Jun 01, 2020, 19:35 IST
ముంబై: ‘యెహ్‌ రిష్తా క్యా కెహల్తా హై’ ఫేం నటి మోహనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరోనా...
01-06-2020
Jun 01, 2020, 18:46 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలోనే సువర్ణాధ్యాయాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు...
01-06-2020
Jun 01, 2020, 17:22 IST
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం దాదాపు మూడు నెలల అనంతరం పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా భేటీ అయింది. ప్రధాన ఎన్నికల అధికారి,...
01-06-2020
Jun 01, 2020, 16:51 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను...
01-06-2020
Jun 01, 2020, 16:08 IST
సాక్షి, ముంబై:  వరుసగా నాలుగో రోజు కూడా  దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు, కరోనా వైరస్‌ కట్టడికి విధించిన రెండు...
01-06-2020
Jun 01, 2020, 15:33 IST
రోమ్‌: క‌రోనా క‌రాళ నృత్యం చేసిన ఇట‌లీలో వైర‌స్ వ్యాప్తి గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో ఆ దేశం ఊపిరి పీల్చుకుంటున్న విష‌యం తెలిసిందే....
01-06-2020
Jun 01, 2020, 15:17 IST
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం దిశగా పయనిస్తోంది. కరోనా సంక్షోభంలో సంభవించిన వ్యాపార నష్టాలు, ఖర్చులు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top