CoronaVirus Death Toll: Highest Single Day Spike in India With 5,600 Cases, Tally Reaches 1.06 Lakh | కరోనా.. ఒక్క రోజే 5,600 కేసులు - Sakshi
Sakshi News home page

కరోనా.. ఒక్క రోజే 5,600 కేసులు

May 20 2020 9:21 AM | Updated on May 20 2020 1:02 PM

Corona Death Toll Rises To 3303 In India - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,611 కరోనా కేసులు నమోదయయ్యాయి. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 42,297 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 3,303 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 61,149 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి : డబ్ల్యూహెచ్‌ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి)

అత్యధికంగా మహారాష్ట్రలో 37,136 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 9,639 కరోనా నుంచి కోలుకోగా, 1,325 మంది మృతిచెందారు. ఆ తర్వాత   తమిళనాడులో 12,448, గుజరాత్‌లో 12,140, ఢిల్లీలో 10,554 కరోనా కేసులు నమోదయ్యాయి. (చదవండి : జూన్‌ 1 నుంచి 200 రైళ్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement