యూనిఫాంతో మోకరిల్లిన సీఐ.. ట్రోలింగ్‌

UP Cop Trolled Because Kneels Before Yogi Adityanath - Sakshi

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్‌ అధికారి చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ముందు యూనిఫాంలో మోకరిల్లిన  సదరు అధికారి.. పైగా ఆ ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీంతో పలువురు ఆన్‌లైన్‌లో సీఐను ట్రోల్‌ చేయటం ప్రారంభించారు.

గురుపూర్ణిమ సందర్భంగా గోరఖ్‌నాథ్‌ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆలయ పెద్ద ఆదిత్యానాథ్‌ హాజరయ్యారు. దీంతో భద్రత కోసం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సింగ్‌ అక్కడికొచ్చారు. ఈ సందర్భంగా యోగి నుంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రవీణ్‌.. ఆయా ఫోటోలను సోషల్‌ మీడియాలో ఉంచి ‘ఫీలింగ్‌ బ్లెస్స్‌డ్‌’ అంటూ పోస్ట్‌ చేశారు. వెంటనే విమర్శలు రావటంతో ప్రవీణ్‌ స్పందించలేదు. ‘నేను సీఎం హోదాలో ఆయనకా గౌరవం ఇవ్వలేదు. కేవలం ఆలయానికి  పెద్దగా మాత్రమే పూజ చేశా’ అంటూ బదులిచ్చారు. 

అయితే చాలా మంది మట్టుకు మాత్రం ప్రవీణ్‌ చేసిన పనిని తప్పుబడుతున్నారు. యూనిఫాంలో ఆ పని చేయాల్సిన అవసరం ఏంటి? సిగ్గుందా? పోలీసుల పరువు తీసేశావ్‌.. ప్రభుత్వ ఉద్యోగివేనా? ఇలా పలువురు విరుచుకుపడుతున్నారు. మరోవైపు ట్రోలింగ్‌ కూడా ఓ రేంజ్‌లోనే జరుగుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top