ఇవేనా మంచి రోజులు? | Congress slams fuel price hike, demands rollback | Sakshi
Sakshi News home page

ఇవేనా మంచి రోజులు?

May 16 2015 12:21 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఇవేనా మంచి రోజులు? - Sakshi

ఇవేనా మంచి రోజులు?

నరేంద్ర మోదీ సర్కారు సాధారణ ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేయడం లేదని కాంగ్రెస్ మరోసారి మండిపడింది.

లక్నో:నరేంద్ర మోదీ సర్కారు సాధారణ ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేయడం లేదని కాంగ్రెస్ మరోసారి మండిపడింది. ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటే ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించింది. శుక్రవారం మరోసారి పెరిగిన పెట్రో ధరలతో ప్రజలపై మరింత భారం పడతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మంచి రోజులు(అచ్చీ దిన్) వచ్చాయని చెబుతున్న మోదీ దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇవేనా మోదీ చెప్పే మంచి రోజులు అని నిలదీశారు.

 

యూపీఏ హయాంలో అంతర్జాతీయంగా తగ్గిన పెట్రోల్ ధరలు.. ఇప్పుడు దేశీయంగా ఎందుకు పెరుగుతున్నాయో?అర్ధం కావడం లేదన్నారు. పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement