
హూడాపై తిరుగుబాటు.. మంత్రి రాజీనామా
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో అధికార కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. సీఎం భూపీందర్‌సింగ్ హూడా వైఖరికి నిరసనగా విద్యుత్‌శాఖ మంత్రి అజయ్ యాదవ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
చండీగఢ్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో అధికార కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. సీఎం భూపీందర్‌సింగ్ హూడా వైఖరికి నిరసనగా విద్యుత్‌శాఖ మంత్రి అజయ్ యాదవ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. అభివృద్ధి, నియామకాల్లో వివక్ష, అధికార యంత్రాంగం ఆధిపత్య ధోరణి వల్ల రాజీనామా చేసినట్లు చెప్పారు.
కాగా, సమాచార కమిషనర్ల ప్రమాణస్వీకారం అంశంలో హూడా చర్యను తప్పుబట్టిన తనను ఆ రాష్ట్ర సీఎస్ బెదిరించారని ఐఏఎస్ అధికారి ప్రదీప్ కస్ని ఆరోపించారు. కొత్త గవర్నర్ నియామకమైన నేపథ్యంలో హడావుడిగా ఇద్దరితో సమాచార కమిషనర్లుగా, మరో ముగ్గురి చేత సేవాహక్కు కమిషన్ కమిషనర్లుగా హూడా ప్రమాణ స్వీకారం చేయించడం వివాదాస్పదమైంది.