breaking news
Ajay Yadav
-
టీమిండియా గోల్స్ వర్షం!
లండన్: భారత హాకీ జూనియర్ టీమ్ ఆతిథ్య ఇంగ్లండ్ పై అద్భుత విజయాన్ని సాధించింది. మార్లోలోని బిషమ్ అబ్బే స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అజయ్ యాదవ్, వరుణ్ కుమార్ చెరో రెండు గోల్స్ తో విజృంభించడంతో 7-1 తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిచింది. భారత ఆటగాళ్లు మైదానంలో చురుకుగా కదలడంతో ఇంగ్లండ్ నుంచి సమాధానమే లేకుండా పోయింది. భారత ఆటగాళ్లలో అజయ్ యాదవ్ రెండు గోల్స్ ( 27, 43వ నిమిషాలలో), వరుణ్ కుమార్ రెండు గోల్స్ (32, 35వ నిమిషాలలో) చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగా, మన్ ప్రీత్, గుర్జంత్ సింత్, సిమ్రన్ జీత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. మన్ ప్రీత్ గోల్ తో భారత్ ఖాతా తెరవగా, అక్కడి నుంచి భారత్ గోల్స్ వర్షంతో ఇంగ్లండ్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఇంగ్లండ్ తరఫున ఎడ్ హోలర్ మాత్రమే గోల్ చేశాడు. తొలి అర్ధభాగం వరకు 4-1 ఆధిక్యంలో ఉన్న భారత ఆటగాళ్లు రెండో అర్ధభాగంలోనూ గోల్ పోస్టులపై పదే పదే దాడులు చేస్తూ ఆధిపత్యాన్ని మరింత పెంచుకున్నారు. -
హూడాపై తిరుగుబాటు.. మంత్రి రాజీనామా
చండీగఢ్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో అధికార కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. సీఎం భూపీందర్‌సింగ్ హూడా వైఖరికి నిరసనగా విద్యుత్‌శాఖ మంత్రి అజయ్ యాదవ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. అభివృద్ధి, నియామకాల్లో వివక్ష, అధికార యంత్రాంగం ఆధిపత్య ధోరణి వల్ల రాజీనామా చేసినట్లు చెప్పారు. కాగా, సమాచార కమిషనర్ల ప్రమాణస్వీకారం అంశంలో హూడా చర్యను తప్పుబట్టిన తనను ఆ రాష్ట్ర సీఎస్ బెదిరించారని ఐఏఎస్ అధికారి ప్రదీప్ కస్ని ఆరోపించారు. కొత్త గవర్నర్ నియామకమైన నేపథ్యంలో హడావుడిగా ఇద్దరితో సమాచార కమిషనర్లుగా, మరో ముగ్గురి చేత సేవాహక్కు కమిషన్ కమిషనర్లుగా హూడా ప్రమాణ స్వీకారం చేయించడం వివాదాస్పదమైంది.