కడలిలో విసిరేసారు.. అధికారులు పట్టేశారు

Coast Guard Officers Catch Gold Biscuits in Tamil nadu Sea - Sakshi

తనిఖీలకు భయపడి గిరాటు

తమిళనాడులో 15 కిలోల బంగారు సముద్రం నుంచి వెలికితీత  

సాక్షి ప్రతినిధి, చెన్నై: శ్రీలంక నుంచి తమిళనాడుకు రహస్యంగా రవాణా అవుతున్న 15 కిలోల బంగారు కడ్డీలను తనిఖీలకు భయపడి కడలిలో విసిరేయడం, వాటిని వెలికితీసిన సంఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. శ్రీలంక నుంచి తమిళనాడుకు భారీ ఎత్తున బంగారు రవాణా జరుగుతున్నట్లు తూత్తుకూడి డైరెక్టర్‌ ఆఫ్‌ రెవె న్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులకు మంగళవారం స మాచారం వచ్చింది. రామనాథపురం జిల్లా మండ పం సముద్రతీర ప్రాంతాల్లో కోస్ట్‌గార్డు సిబ్బంది తో కలిసి నిఘాపెట్టారు. శ్రీలంక–భారత్‌ సరిహద్దులో బుధవారం ఉదయం ఒక నాటుపడవ వస్తుండడాన్ని గమనించి అడ్డుకుని తనిఖీలు చేపట్టగా అందులో ఏమీ లేదు.

నాటుపడవలో వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తాము తీసుకొచ్చిన 15 కిలోల బంగారు కడ్డీలను నడిసముద్రంలో విసిరేసినట్లు అంగీకరించారు. నిందితులను వెంటపెట్టుకుని వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డు సిబ్బంది కడలి గర్భంలోకి వెళ్లి ఐదు ప్యాకెట్లలో భద్రం చేసిన బంగారు బిస్కెట్ల సంచిని బయటకు తీశారు. మార్కెట్‌ ధర ప్రకారం ఈ బంగారు విలువ రూ.6.30 కోట్లని అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top