ఇద్దరి గొడవ.. రెండు ప్రాంతాలకు ఎగబాకి | Clash in Madhya Pradesh town; 50 held, curfew imposed | Sakshi
Sakshi News home page

ఇద్దరి గొడవ.. రెండు ప్రాంతాలకు ఎగబాకి

Jan 17 2016 5:10 PM | Updated on Oct 8 2018 3:17 PM

మధ్యప్రదేశ్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు భిన్న వర్గాలు తన్నుకున్నాయి. రోడ్ల మీదకు వచ్చి అలజడి సృష్టించాయి.

దేవాస్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్త రెండు గ్రూపుల మధ్య ఘర్షణగా మారింది. రెండు భిన్న వర్గాలు తన్నుకున్నాయి. రోడ్ల మీదకు వచ్చి అలజడి సృష్టించాయి. దీంతో భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు. 50మందిని అదుపులోకి తీసుకున్నారు. కొత్వాలీ అనే ప్రాంతంలో ఓ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఆయుధాలతో వెళ్లి మరో కమ్యూనిటీపై దాడి చేశారు. దీంతో వారు వీరిపై తిరగబడ్డారు.

అది కాస్త రెండు ప్రాంతాలకు ఎగబాకి పెద్ద స్థాయిలో ఘర్షణగా మారింది. మార్కెట్ ప్రాంగణమంతా తొక్కిసలాట చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో నరేంద్ర రాజోరియా రాజోరియా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలోకి తరలించే క్రమంలో ప్రాణాలుకోల్పోయాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు సంభవించగా పోలీసులు వచ్చి శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చి ప్రస్తుతానికి కర్ఫ్యూ విధించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement