ఆపరేషన్ థియేటర్‌లో నర్సుకు ముద్దుపెట్టాడు..

Civil Surgeon Sacked After Kissing Video With Nurse In Ujjain - Sakshi

ఉజ్జయిని: ఆపరేషన్‌ థియేటర్‌లో విధులను మరిచి ప్రవర్తించిన ఓ ప్రభుత్వ వైద్యుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ నర్సును ఆపరేషన్‌ థియేటర్‌లో ముద్దుపెట్టుకున్నాడు. అయితే ఆపరేషన్‌ థియేటర్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఈ వీడియో తొలుత ఆస్పత్రికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అది సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారింది. ఈ విషయం కలెక్టర్‌ శశాంక్‌ మిశ్రా దాకా వెళ్లడంతో.. ఆయన వెంటనే స్పందించారు. ఆ వైద్యుని విధుల నుంచి తొలగించడంతోపాటు, ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. 

ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి మోహన్‌ మల్వియా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఆ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, స్థానిక పోలీసులకు ఈ కేసులో అధికారింగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top