షెడ్యూలు ప్రకటించిన కౌన్సిల్‌

CISCE Releases 10th and 12th  Class EXamination Schedule - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ ( సీఐఎస్‌సీఈ) సిద్దమైంది. కొన్ని సబెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించిన తరువాత కరోనా కారణంగా ఐసీఎస్సీ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. 10వ తరగతి, 12 వ తరగతి పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ను సీఐఎస్‌సీఈ శుక్రవారం విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలను జూన్‌ 2 నుంచి జూలై 12 వరకు నిర్వహించన్నారు. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను జూలై 1 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు సీఐఎస్‌సీఈ ప్రకటించింది. ఈ పరీక్షలు రోజు మార్చి రోజు జరగనున్నాయి.ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 11గంటలకు ప్రారంభం అవుతాయి   (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top