లడఖ్‌లో చైనా చొరబాటు యత్నం | China's intrusion into Ladakh | Sakshi
Sakshi News home page

లడఖ్‌లో చైనా చొరబాటు యత్నం

Aug 16 2017 12:59 AM | Updated on Sep 17 2017 5:33 PM

లడఖ్‌లో చైనా చొరబాటు యత్నం

లడఖ్‌లో చైనా చొరబాటు యత్నం

భారత్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా చొరబాటు యత్నాల్ని భారత్‌ బలగాలు దీటుగా తిప్పికొట్టాయి.

లడఖ్‌: భారత్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా చొరబాటు యత్నాల్ని భారత్‌ బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. జమ్మూ కశ్మీర్‌ లడఖ్‌ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్‌ సరస్సు సమీపంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరగడంతో ఇరువైపులా కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

భారత్‌ వైపు సరస్సు ఒడ్డున ఉన్న ఫింగర్‌ ఫోర్, ఫింగర్‌ ఫైవ్‌ ప్రాంతాల్లో ఉదయం 6–9 గంటల మధ్య చైనా చొరబాటుకు ప్రయత్నించిందని, అయితే భారత బలగాల అప్రమత్తంగా ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని వారు తెలిపారు. అనంతరం చైనా బలగాలు మానవహారంగా ఏర్పడి రాళ్ల దాడికి పాల్పడ్డాయని భారత సరిహద్దు దళం కూడా దీటుగా బదులిచ్చిందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement