'మెట్రో' రాడ్ మీద పడి టెకీ మృతి | Chennai Techie Killed As Rod From Under-Construction Metro Station Falls on Him | Sakshi
Sakshi News home page

'మెట్రో' రాడ్ మీదపడి టెకీ మృతి

Jun 17 2015 12:51 PM | Updated on Jul 11 2019 8:56 PM

'మెట్రో' రాడ్ మీద పడి టెకీ మృతి - Sakshi

'మెట్రో' రాడ్ మీద పడి టెకీ మృతి

చెన్నైలో నిర్మాణంలో ఉన్న మెట్రోస్టేషన్ రాడ్ కూలడంతో టెకీ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. చెన్నైలో రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం ఎనిమిది గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

చెన్నై: చెన్నైలో నిర్మాణంలో ఉన్న మెట్రోస్టేషన్ లోని ఇనుప రాడ్ మీదపడటంతో టెకీ మృతిచెందిన ఘటన కలకలం రేపింది. చెన్నైలో రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం ఎనిమిది గంటలకు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఐటి కంపెనీలో పనిచేసే మాదిపక్కం ఏరియాకు చెందిన  గిరిధర్ (30) ఉదయం తన బైక్ పై ఆఫీసుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్ నుంచి పది అడుగుల ఇనుప రాడ్ అతనిపై పడి బలంగా తాకడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. కాగా, గత మూడేళ్లలో ఈ తరహా ప్రమాదాల్లో నలుగురు చనిపోయినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement